MS Dhoni : 7వ నంబర్‌ జెర్సీ.. అందుకే నాకు ప్రత్యేకం : ధోనీ ఆసక్తికర సమాధానం..

జెర్సీ నంబర్‌ 7తో ధోనీ(MS Dhoni)కి ప్రత్యేక అనుబంధం ఉంది. దీనిపై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 11 Feb 2024 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంఎస్‌ ధోనీ(MS Dhoni).. క్రికెట్‌లో ఈ పేరే ఓ సంచలనం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తి. ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులే కాదు.. ఇతర జట్టులోని ఆటగాళ్లూ అతడిని ఆరాధిస్తుంటారు. టీమ్‌ఇండియా(Team India)కు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్‌ మహీకి.. జెర్సీ నంబర్‌ 7తో ప్రత్యేక అనుబంధమున్న విషయం తెలిసిందే. ఈ నంబర్‌నే ఎంచుకోవడానికి గల కారణాన్ని ఓ కార్యక్రమంలో వివరించాడు.

7వ నంబర్‌ మీకెందుకంత ప్రత్యేకం?అదే సమయంలో ఇంటికి రావాలని మీ తల్లిదండ్రులు కోరుకునేవారా..?.. అని ఆ కార్యక్రమంలోని యాంకర్‌ సరదాగా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘లేదు.. నన్ను ఆ తేదీనే కనాలని మా తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. నేను జులై 7, 1981లో జన్మించాను. జులై అంటే ఏడో నెల. 81వ సంవత్సరం.. 8-1 అదీ ఏడే. అందుకే ఈ నంబర్‌ ప్రత్యేకం. దీంతో నీకు ఏ జెర్సీ నంబర్‌ కావాలని అడిగినప్పుడు.. దీన్ని ఎంచుకోవడం నాకు సులభమైంది’’ అంటూ ధోనీ చమత్కరించాడు.

గత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై జట్టును విజేతగా నిలిపిన మహీ.. అత్యధిక ట్రోఫీలు గెలిచిన ముంబయి రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. త్వరలో ప్రారంభం కాబోయే సీజన్‌ కోసం.. క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు అతడు సిద్ధమవుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని