IND vs SA : రిషభ్‌పంత్‌ ఒంటరి పోరాటం.. టీమ్‌ఇండియా ఆలౌట్‌

సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (100) శతకంతో రాణించాడు. మూడో రోజు ఆట ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో

Updated : 13 Jan 2022 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (100*) శతకంతో రాణించాడు. దీంతో దక్షిణాఫ్రికాకు టీమ్‌ఇండియా 212 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 198 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ 13 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్‌ 211 పరుగుల లీడ్‌ సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 57/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు (పుజారా, రహానె) కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్‌ పంత్‌ ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (29) ఫర్వాలేదనిపించాడు. కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యం (94) నెలకొల్పాడు. అయితే కోహ్లీతో సహా ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పంత్‌ ఆఖరి వరకు నిలకడగా రాణించాడు. సఫారీ జట్టు బౌలర్ల దెబ్బకు మిగతా భారత బ్యాటర్లు విఫలమయ్యారు. కేఎల్‌ రాహుల్ 10, మయాంక్‌ అగర్వాల్ 7, పుజారా 9, రహానె 1, అశ్విన్‌ 7, శార్దూల్‌ ఠాకూర్‌ 5 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు తీశారు.

స్కోరు వివరాలు: 

తొలి ఇన్నింగ్స్‌: భారత్‌ 223/10.. దక్షిణాఫ్రికా 210/10

రెండో ఇన్నింగ్స్‌: భారత్‌ 198 ఆలౌట్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు