Tokyo Olympics: ఆ డ్రైవర్ల పట్ల మీరాబాయి కృతజ్ఞతాభావం

టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటి భారత్‌కు కాంస్య పతకం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ట్రక్‌ డ్రైవర్లను మరచిపోలేదు.

Updated : 06 Aug 2021 10:40 IST

గువాహటి: టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటి భారత్‌కు రజత పతకం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ట్రక్కు డ్రైవర్లను మాత్రం మరచిపోలేదు. వెయిట్‌ లిఫ్టర్‌గా ఎదిగిన క్రమంలో సాధన చేసేందుకు తాను రోజూ ఇంఫాల్‌లోని స్టేడియానికి వెళ్లేందుకు లిఫ్ట్‌ ఇచ్చిన డ్రైవర్లను వెతికి మరీ ఇంటికి పిలిచి సన్మానించారు. వారు తనకు చేసిన మేలుకు గుర్తుగా గురువారం మణిపుర్‌లోని తన స్వగ్రామంలో అందరినీ ఆహ్వానించి తగిన కానుకలతో గౌరవించడం విశేషం. 

వెయిట్‌లిప్టర్‌గా సాధన చేస్తున్న ప్రారంభ సమయంలో తాను ఇంఫాల్‌లోని ఖుమన్ లంపక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు వెళ్లాల్సి వచ్చేదని మీరాబాయి చాను చెప్పారు. అయితే ఆ స్టేడియం తన గ్రామం నుంచి 25 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉందని చెప్పుకొచ్చారు. అక్కడికి రోజూ బస్సులో వెళ్లేందుకు ఛార్జీలు చెల్లించలేని స్థితిలో తమ కుటుంబం ఉండగా.. ఆ సమయంలో ఇసుక లోడుతో అటుగా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్లు తనను ఉచితంగా ఇంఫాల్‌కు తీసుకెళ్లేవారని గుర్తుచేసుకున్నారు. అయితే ఆ సమయంలో వారు చేసిన సహాయం.. నేడు తాను ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు దోహదం చేసినట్టు పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని