విరుష్క దంపతుల కుమార్తె ఫొటో అంటూ వైరల్‌!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మ సోమవారం తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అనుష్క నిన్న ఆడ పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కోహ్లీయే స్వయంగా సామాజిక...

Published : 12 Jan 2021 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మ సోమవారం తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అనుష్క నిన్న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కోహ్లీయే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. తల్లీకూతుళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారని, అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పాడు. ఇప్పుడు తమకు ప్రైవసీ కావాలని కోరాడు. కోహ్లీ ఈ విషయం తెలియజేయగానే ఆ స్టార్‌ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

అయితే, విరుష్క దంపతుల కుమార్తె తొలి ఫొటో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ సోదరుడు వికాస్‌ కోహ్లీ గతరాత్రి చిన్నారి పాప ఫొటోను ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తెల్లటి బ్లాంకెట్‌లో పాపాయిని చుట్టి ఉండగా.. కాళ్లు కనపడేలా ఆ ఫొటో పంచుకొని దానికి ‘స్వాగతం’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, తమ ఇంట్లోకి లిటిల్‌ ఏంజిల్‌ వచ్చిందని వ్యాఖ్యానించాడు. ఈ పోస్టు చూసిన అభిమానులు అది విరుష్క కుమార్తె అని భావించి పెద్ద ఎత్తున లైకులు కొడుతున్నారు. అయితే, అది నిజమైన ఫొటో కాదని, కోహ్లీ సోదరుడు ప్రతీకాత్మక చిత్రాన్ని పోస్టు చేశాడని తర్వాత అసలు విషయం తెలిసింది. 

ఇవీ చదవండి..
స్మిత్‌ ఛీటర్‌ కాదు: ఆసీస్‌ కెప్టెన్‌ 
‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని