Rohit Sharma: రోహిత్‌ ఆరోగ్యంపై సమైరా‌ అప్‌డేట్‌.. ముద్దుముద్దు మాటల వీడియో వైరల్

టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ కరోనాబారిన పడి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో కీలక టెస్టుకు ముందు ఇలా జరగడం టీమ్‌ఇండియాకు పెద్ద షాకే అయినా...

Published : 28 Jun 2022 10:33 IST

(Photo: Rohit Sharma Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ కరోనాబారిన పడి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో కీలక టెస్టుకు ముందు ఇలా జరగడం టీమ్‌ఇండియాకు పెద్ద షాకే అయినా.. మ్యాచ్‌ ప్రారంభానికల్లా అతడు కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, అతడు తుది జట్టులో ఉంటాడా..లేదా.. అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు రోహిత్‌ ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉండటంతో అతడి సతీమణి రితికా, కుమార్తె సమైరా వేరే చోటుకు మారిపోయారు. ఈ సందర్భంగా హోటల్‌ లాంజ్‌లో వారిని గమనించిన రోహిత్‌ అభిమానులు.. సమైరాను చూసి హాయ్‌ అని పలకరించారు. దీంతో ఆ చిన్నారి కూడా వారికి సైగలు చేసింది. అనంతరం వారు రోహిత్‌ గురించి అడిగిన ప్రశ్నలకు ఇంగ్లిష్‌లో ముద్దుముద్దుగా సమాధానమిచ్చింది.

* హాయ్‌ సమైరా ఎలా ఉన్నావ్‌?

సమైరా: హాయ్‌.. నేను బాగున్నా.

* మీ నాన్న ఎక్కడ ఉన్నాడు?

సమైరా: రూమ్‌లో ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడు.

* ఇప్పుడెలా ఉన్నాడు? బాగున్నాడా?

సమైరా: హా.. ఇప్పుడు బాగున్నాడు. కానీ, నాన్నకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా వచ్చింది. ఆయన కోలుకోవడానికి సమయం పడుతుంది.

ఇలా చాలా క్యూట్‌గా ఇంగ్లిష్‌లో సమాధానాలిచ్చింది. కాగా, ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో రోహిత్‌ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. మీరూ ఆ వీడియో ఆస్వాదించండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని