Ravindra Jadeja: రవీంద్ర జడేజాను మనం మిస్‌ అవుతాం.. కానీ..

ఈ సిరీస్‌ విజయంలో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కీలక భూమికను పోషించిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు‌..

Updated : 28 Sep 2022 12:50 IST

మాజీ కెప్టెన్‌ అజయ్‌ జడేజా ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో లభించిన జోరును రోహిత్‌ సేన తదుపరి మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. ఆసీస్‌పై తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైనప్పటికీ.. తర్వాతి రెండు మ్యాచ్‌లో పుంజుకున్న తీరు అద్భుతం. ఈ సిరీస్‌ విజయంలో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కీలక భూమికను పోషించిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు‌.. ఈ సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసుకోవడమే కాకుండా.. పొదుపుగా బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు.

అక్షర్‌ పటేల్‌ ప్రదర్శనను మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా కొనియాడాడు. రవీంద్ర జడేజా స్థానంలో వచ్చిన అక్షర్‌.. తన ఎంపిక సరైనదేనని నిరూపించుకున్నాడని తెలిపాడు. ‘తనకు వచ్చిన అవకాశాన్ని అక్షర్‌ రెండు చేతులా ఉపయోగించుకున్నాడు. భారత క్రికెట్‌లోనే ఇలా జరుగుతుంది. రవీంద్ర జడేజాను మనం మిస్‌ అవుతామన్నది నిజమే.. అయితే, అతడి స్థానంలో అక్షర్‌ ఎంపిక విలువైనదే. ముఖ్యంగా అతడు బంతితో ఆకట్టుకుంటున్న విధానం బాగుంది. బ్యాటింగ్‌ కూడా చేస్తాడు కాబట్టి.. అతడు ఇక్కడ సరిపోతాడు. అయితే ఫీల్డింగ్‌ విషయంలోనే అతడు సెట్‌ కాలేదు’ అని ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ అజయ్‌ జడేజా విశ్లేషించాడు. అక్షర్‌ పటేల్‌ ఇదే ప్రదర్శనను కొనసాగించి.. ప్రపంచకప్‌ గెలిచి తిరిగి రావాలని జడేజా ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియా సిరీస్‌లో అక్షర్‌ మొత్తం 8 వికెట్లు తీయడమే కాకుండా.. 6.30 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్‌ చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని