ODI WC 2023: కుల్‌దీప్‌ - చాహల్‌.. నా ఫస్ట్‌ ఛాయిస్‌ ఎవరంటే?: మంజ్రేకర్

భారత్‌కు ఇద్దరు సీనియర్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్లు, ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు ఉన్నారు. వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) కోసం జట్టులోకి ఈ నలుగురు ఉంటారు. అయితే, తుది జట్టులో మాత్రం స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఒకరికే అవకాశం ఉండొచ్చు.

Published : 02 Jul 2023 16:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌ 2023 (ODI World Cup 2023) షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి  మెగా టోర్నీ కోసం అభిమానులు  ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక భారత జట్టు కూర్పు ఎలా ఉంటుంది.. గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న ఆటగాళ్లు వస్తారో లేదో..? బ్యాటింగ్ విభాగం ఎలా ఉంటుంది..? బౌలింగ్‌ అటాక్‌ ఎలా ఉండే బాగుంటుంది..? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో... టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ భారత స్పిన్‌ విభాగంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచ కప్‌ కోసం ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ను తీసుకుంటారనే చర్చ సాగుతోంది. అయితే తుది జట్టులో మాత్రం ఒకరికే అవకాశం వస్తుంది. ఇద్దరిని బరిలోకి దింపినా ఆశ్చర్యపోనక్కర్లేదని సంజయ్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘ఇద్దరు రిస్ట్‌ స్పిన్నర్లు తుది జట్టులో ఉండటంపై చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తారు. నేను కూడా అటువైపుగా ఆలోచించడంలేదు. కానీ, ప్రత్యర్థి బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో బలహీనంగా ఉంటే ఇద్దరినీ బరిలోకి దింపాలి. చాహల్‌ అద్భుతమైన స్పిన్నర్‌ కానీ, వన్డేల్లోకి వచ్చేసరికి కుల్‌దీప్‌ యాదవ్‌ వైపు నేను మొగ్గు చూపుతా. ఇక్కడొక టెక్నికల్‌ పాయింట్‌ చెబుతా. బ్యాటర్లు భారీ షాట్‌ కొట్టకుండా నిలకడగా రన్స్‌ చేసేవారిని ఔట్ చేసే స్పిన్నర్‌ అవసరం. నేనైతే చాహల్‌ కంటే కుల్‌దీప్‌ అయితే బాగుండని భావిస్తున్నా’’ అని మంజ్రేకర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని