
WI vs SL: ఆసుపత్రిపాలైన విండీస్ ఆటగాడు.. నిలకడగా ఆరోగ్య పరిస్థితి
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లోకి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఆటగాడికి అదొక మరువరాని రోజు. ఇన్నేళ్లు పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలం. ఇలాంటి రోజున ప్రత్యేక ప్రదర్శనతో అదరగొట్టాలని ప్రతి క్రికెటర్ భావిస్తాడు. అయితే వెస్టిండీస్ టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన ఆటగాడు జెరేమీ సోలొజానోకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు విండీస్ అక్కడ పర్యటిస్తోంది. లంకతో జరుగుతున్న తొలి టెస్టుకు విండీస్ తరఫున జెరేమీ ఎంపికయ్యాడు. అయితే టాస్ నెగ్గిన లంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న జెరేమీ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యాడు. లంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ఆడిన ఫుల్‌షాట్‌ను ఆపే ప్రయత్నంలో బ్యాటర్‌కు క్లోజ్‌గా ఉన్న జెరేమీ హెల్మెట్‌ను బంతి బలంగా తాకింది. దీంతో జెరేమీ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలాడు. హుటాహుటిన వైద్య సిబ్బంది స్ట్రెచర్‌పై బాధిత ఆటగాడిని ఆసుపత్రికి తరలించింది.
జెరేమీ గాయం ఘటనకు సంబంధించి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. ‘‘ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా జెరేమీ గాయపడ్డాడు. స్కానింగ్, వైద్య చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించాం. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది. ప్రస్తుతం జెరేమీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తదుపరి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోనే ఉంటాడని విండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.