INDw Vs ENGw: రేణుకా సింగ్‌ ఖాతాలో మూడు వికెట్లు.. ఇంగ్లాండ్‌ స్కోరు 72/3 (10)

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో భారత్‌ (IND w VS ENG w) తలపడుతోంది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పటికీ.. కెప్టెన్ హీథర్ నైట్‌తో కలిసి నాట్ స్కివెర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించింది. భారత బౌలర్‌ రేణుకా సింగ్‌ మూడు వికెట్లను పడగొట్టింది.

Updated : 18 Feb 2023 19:32 IST

 

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచకప్ (WOMENS T20 World Cup 2023)లో భాగంగా గ్రూప్‌ స్టేజ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆరంభంలో అదరగొట్టారు. టాప్‌ - బ్యాటర్లను త్వరగానే పెవిలియన్‌కు చేర్చినప్పటికీ.. ఇంగ్లాండ్‌ కెప్టెన్ హీథర్ నైట్ (23*), నాట్‌ స్కివెర్ (35*) క్రీజ్‌లో నిలదొక్కుకుని పరుగులు రాబడుతున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం దిశగా సాగుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి  ఇంగ్లాండ్‌ మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. భారత బౌలర్ రేణుకా సింగ్‌ కీలమైన ఓపెనర్లు సోఫీ డంక్లే (10), డానిల్లె వ్యాట్ (0), ఎలిస్‌ కాప్సే (3) వికెట్లను తన ఖాతాలో వేసుకొంది. సోఫీ, కాప్సేను క్లీన్‌బౌల్డ్‌ చేయగా.. వ్యాట్‌ మాత్రం రిచా ఘోష్ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని