World Cup-BAN vs AFG: అఫ్గాన్‌పై విజయం.. ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) బోణీ కొట్టింది. అఫ్గానిస్థాన్‌ (Afghanistan) తో జరిగిన తన మ్యాచ్‌లో బంగ్లా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Published : 07 Oct 2023 16:47 IST

ధర్మశాల: ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) బోణీ కొట్టింది. అఫ్గానిస్థాన్‌ (Afghanistan) తో జరిగిన తన మ్యాచ్‌లో బంగ్లా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ ఆరంభంలో మెరుగ్గానే ఆడినప్పటికీ కీలక సమయంలో వికెట్లు కోల్పోయి 37.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు  కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు తాంజిద్ హసన్ (5), లిట్టన్ దాస్ (13) విఫలం కాగా.. తర్వాత వచ్చిన మెహిదీ హసన్ మిరాజ్ (57; 73 బంతుల్లో 5 ఫోర్లు), నజ్ముల్ హొస్సేన్ శాంటో (59; 83 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) నిలకడగా ఆడి అర్ధ శతకాలు సాధించారు.  షకీబ్‌ అల్‌ హసన్ (14) పరుగులు చేశాడు. అఫ్గాన్‌ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, నవీనుల్ హక్, అజ్మతుల్లా తలో వికెట్ పడగొట్టారు. 

Asian Games 2022: అఫ్గానిస్థాన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు.. టీమ్‌ఇండియాకు స్వర్ణం

అఫ్గాన్‌ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (47) టాప్‌ స్కోరర్. ఇబ్రహీం జాద్రాన్ (22), అజ్మతుల్లా (22), రహ్మత్ షా (18), హష్మతుల్లా షాహిది (18) పరుగులు చేశారు. ఒక దశలో 15 ఓవర్లకు 83/1తో ఉన్న అఫ్గాన్‌.. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో  వరుసగా వికెట్లను కోల్పోయింది. రషీద్‌ ఖాన్ (9), నబీ (6) విఫలం కావడం అఫ్గాన్‌ను దెబ్బతీసింది. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ 3, షకిబ్ 3, షోరిఫుల్ ఇస్లామ్ 2, తస్కిన్, ముస్తాఫిజర్‌ ఒక్కో వికెట్ తీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని