World Cup - ENG vs BAN: భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్.. శతకంపై కన్నేసిన డేవిడ్ మలన్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ (England) భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ డేవిడ్ మలన్ శతకంపై కన్నేశాడు. 

Updated : 10 Oct 2023 12:38 IST

ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌ (ENG vs BAN) మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో కంగుతిన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌.. ఈ మ్యాచ్‌లో అయినా బంగ్లాను చిత్తు చేసి బోణీ కొట్టాలని చూస్తోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లిష్‌ జట్టు భారీ స్కోరుపై కన్నేసింది. 25 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ (78*; 70 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం దిశగా సాగుతున్నాడు. మరో ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో (52; 59 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకంతో మెరిశాడు. జో రూట్ (17*) పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన బెయిర్‌ స్టో, మలన్ జోడీని షకీబ్‌ అల్ హసన్ విడదీశాడు. షకీబ్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తుంటి గాయం నుంచి కోలుకుంటున్న ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్‌స్టోక్స్‌ ఈ మ్యాచ్‌లో కూడా ఆడటం లేదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కూ అతడు దూరంగా ఉన్నాడు. బంగ్లా.. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్‌పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని