David Warner: వచ్చే ఐపీఎల్‌లో వార్నర్ ఆడేది ఆ జట్టుకే : బ్రాడ్‌ హగ్‌

టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా నిలిచిన డేవిడ్ వార్నర్‌ను.. వచ్చే ఐపీఎల్‌లో సొంతం చేసుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు పోటీ పడతాయని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌..

Published : 17 Nov 2021 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’గా నిలిచిన డేవిడ్ వార్నర్‌ను.. వచ్చే ఐపీఎల్‌లో సొంతం చేసుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు పోటీ పడతాయని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్ హగ్‌ అన్నాడు. అతడు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు సొంతం చేసుకున్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పాడు. ఆసీస్‌ ఛాంపియన్‌గా నిలవడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడని హగ్‌ పేర్కొన్నాడు. 

‘వచ్చే ఐపీఎల్‌లో వార్నర్‌ సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడకపోవచ్చు. యాజమాన్యంతో అతడికి విభేదాలు వచ్చినట్లున్నాయి. అందుకే, వేలంలో అతడిని సొంతం చేసుకునేందుకు పలు ప్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది. అతడిని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు యాజమాన్యం సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్‌ కోహ్లి బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ప్రస్తుతం, ఆ జట్టుకు నాయకుడి అవసరం ఉంది. వార్నర్‌కు కెప్టెన్‌గా చేసిన అనుభవం కూడా ఉండటం.. ఆ జట్టుకు కలిసొస్తుంది’ అని హగ్ పేర్కొన్నాడు. 

గత ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు వరుసగా పలు మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో.. ఆ జట్టు యాజమాన్యం వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆ తర్వాత తుది జట్టు నుంచి కూడా తప్పించి డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం చేసిన విషయం తెలిసిందే. వార్నర్‌ సారథ్యంలో హైదరాబాద్‌ జట్టు 2016లో ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని