Google Chrome: క్రోమ్‌ బ్రౌజర్‌లో బగ్స్‌.. వెంటనే అప్‌డేట్ చేయండి!

గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో లోపాలున్నాయని, యూజర్స్ వెంటనే క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (సీఈఆర్‌టీ-ఇన్‌)తోపాటు గూగుల్ సూచించింది. 

Updated : 19 Dec 2021 21:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది ఉపయోగించేది గూగుల్ క్రోమ్‌ (Google  Chrome)బ్రౌజర్‌నే. ఆన్‌లైన్‌ షాపింగ్‌ నుంచి ఆరోగ్య సంబంధిత వివరాల వరకు ఎలాంటి సమాచారమైనా క్రోమ్‌ బ్రౌజర్‌లో వెతికేయొచ్చు. అందుకే దీన్ని ఉపయోగించేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా ఈ బ్రౌజర్‌లో కొన్ని లోపాలున్నాయని.. దాని వల్ల యూజర్స్‌ సమాచారం హ్యాకర్స్‌ చేతికి చేరే అవకాశం ఉందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (సీఈఆర్‌టీ-ఐఎన్‌) వెల్లడించింది. ఈ మేరకు సీఈఆర్‌టీ-ఇన్ (CERT-In) ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘క్రోమ్‌ బ్రౌజర్‌లో కొన్ని లోపాయిన్నాయి. ఉచిత వెబ్‌ యాప్స్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌, విండోస్ మేనేజర్‌, స్క్రీన్ క్యాప్చర్‌, ఫైల్ ఏపీఐ, ఆటో ఫిల్, డెవలపర్స్ టూల్స్‌ వంటి పేర్లతో మాల్‌వేర్‌లు క్రోమ్‌ బ్రౌజర్‌లో యూజర్‌ డేటా సేకరిస్తున్నట్లు గుర్తించాం. వీటి వల్ల క్రోమ్‌ బ్రౌజర్‌ను ఉపయోగించే యూజర్స్ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే యూజర్స్ వెంటనే తమ బ్రౌజర్లను అప్‌డేట్‌ చేసుకోవాలి. ఒకవేళ యూజర్స్ తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోకుంటే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరవచ్చు’’ అని పేర్కొంది. సీఈఆర్‌టీ-ఇన్‌తోపాటు గూగుల్ క్రోమ్ కూడా యూజర్స్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోమని సూచించింది. గూగుల్ తాజాగా విడుదల చేసిన క్రోమ్ అప్‌డేట్‌లో 22 రకాల సెక్యూరిటీ లోపాలను సరిచేసినట్లు తెలిపింది. మరి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఎలా అప్‌డేట్ చేసుకోవాలో చూద్దాం. 

* గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ ఓపెన్ చేయాలి. తర్వాత కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్‌ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. 

* సెట్టింగ్స్‌ ఓపెన్ చేస్తే ‘అబౌట్‌ క్రోమ్‌’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ బ్రౌజర్‌ అప్‌డేట్ కాకుంటే రీలాంచ్‌ చేసి అప్‌డేట్ చేయాలి.

* ఒకవేళ మీ బ్రౌజర్‌ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయితే మీకు లేటెస్ట్ వెర్షన్‌ను చూపిస్తుంది.

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని