Joker Malware: మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా? జాగ్రత్త!

ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్‌ చేయండి... 

Updated : 29 Feb 2024 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత మూడేళ్లుగా గూగుల్ ప్లే స్టోర్ జోకర్‌ మాల్‌వేర్‌ కారణంగా కొన్ని ఆప్లికేషన్లను తొలగిస్తూ వస్తోంది. తాజాగా క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ గూగుల్‌ ప్లే స్టోర్‌లోని మరో ఎనిమిది అప్లికేషన్లలో జోకర్ మాల్వేర్‌ను గుర్తించింది. దాంతో ప్లే స్టోర్‌ ఆ ఎనిమిది అప్లికేషన్లనూ తొలగించింది. ఆండ్రాయిడ్ యూజర్స్‌ తమ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను వెంటనే తొలగించాలని గూగుల్ సూచించింది. 

గూగుల్‌ తొలగించిన యాప్స్‌ ఇవే..

* ఆక్సిలరీ మెసేజ్‌ (Auxiliary Message)

* ఫాస్ట్‌ మ్యాజిక్‌ ఎస్‌ఎంఎస్‌ (Fast Magic SMS)

* ఫ్రీ క్యామ్‌ స్కానర్ (Free CamScanner)

* సూపర్‌ మెసేజ్‌ (Super Message)

* ఎలిమెంట్‌ స్కానర్‌ (Element Scanner)

* గో మెసేజెస్‌ (Go Messages)

* ట్రావల్‌ వాల్‌పేపర్స్‌ (Travel Wallpapers)

* సూపర్‌ ఎస్‌ఎంఎస్‌ (Super SMS)

ఈ జోకర్‌ మాల్‌వేర్ అనేది యాప్‌ల ద్వారా యూజర్స్‌ ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. తర్వాత యూజర్ ప్రమేయం లేకుండా అనవసరమైన పలు రకాల ప్రీమియం సర్వీసులను సబ్‌స్క్రైబ్ చేసుకుంటుంది. ఇందుకోసం చిన్న చిన్న కోడ్‌లను ఉపయోగించి గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌కి దొరకకుండా పని పూర్తి చేస్తుంది. అలానే ఈ యాప్‌లలో వినియోగదారులు వారి వివరాలను రిజిస్టర్‌ చేసుకున్నప్పుడు స్పైవేర్‌తో వారి మెసేజ్‌లు, కాంటాక్ట్‌ లిస్ట్‌తో పాటు డివైజ్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని