కారు జోరుకు తోడుగా..

స్టీరింగ్‌ పట్టుకోకముందే మునివేళ్లు తాకేతెరపై వాలిపోతాయి. ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? ఎక్కడెక్కడ ఏమున్నాయ్‌?.. ఇలా అన్నింటికీ ‘ఆండ్రాయిడ్‌ ఆటో’లోనే సమాధానాలు దొరుకుతాయని అనుకోనక్కర్లేదు. ప్రత్యామ్నాయంగా చాలానే యాప్‌లు ఉన్నాయి. స్టీరింగ్‌పై చేతుల్ని తీయకుండా.. రోడ్డుపై దృష్టిని మరల్చకుండా చక్కని ఫీచర్లను ఫోన్‌లో యాక్సెస్‌ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఓ సారి వాడి చూద్దురూ!...

Published : 31 Mar 2021 00:54 IST

స్టీరింగ్‌ పట్టుకోకముందే మునివేళ్లు తాకేతెరపై వాలిపోతాయి. ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? ఎక్కడెక్కడ ఏమున్నాయ్‌?.. ఇలా అన్నింటికీ ‘ఆండ్రాయిడ్‌ ఆటో’లోనే సమాధానాలు దొరుకుతాయని అనుకోనక్కర్లేదు. ప్రత్యామ్నాయంగా చాలానే యాప్‌లు ఉన్నాయి. స్టీరింగ్‌పై చేతుల్ని తీయకుండా.. రోడ్డుపై దృష్టిని మరల్చకుండా చక్కని ఫీచర్లను ఫోన్‌లో యాక్సెస్‌ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఓ సారి వాడి చూద్దురూ!

ఫోన్‌ స్క్రీన్‌లో ‘ఆటో’
ఆండ్రాయిడ్‌ ఆటో ఫర్‌ ఫోన్‌ స్క్రీన్స్‌
కారులో ఆండ్రాయిడ్‌ ఆటో సపోర్టుతో కూడిన బిల్ట్‌ఇన్‌ డిజిటల్‌ డ్యాష్‌బోర్డు లేకున్నా స్మార్ట్‌ఫోన్‌లో ‘ఆటో’ సేవల్ని పొందొచ్చు. అందుకు ప్రత్యేకమైందే ఈ యాప్‌. ఆండ్రాయిడ్‌ 10 ఓఎస్‌తో పని చేసే అన్ని ఫోన్‌లలో గూగుల్‌ అసిస్టెంట్‌తో ఆటో సేవల్ని యాక్సెస్‌ చేయొచ్చు. చెబితే చాలు.. మీడియా యాప్‌ల్లో మీరు వినే ట్రాక్స్‌ని ప్లే చేస్తుంది. మెసేజ్‌లు పంపడంతో పాటు వచ్చిన వాటికి స్పందించొచ్చు. వెళ్తున్న మార్గంలో ట్రాఫిక్‌ అలర్ట్‌లను పొందొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఫోన్‌లో స్మార్ట్‌గా మీకు కావాల్సిన వాటిని యాక్సెస్‌ చేయొచ్చన్నమాట.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/3s0Kg1d

ప్రయాణానికి ‘తోడు’
ఆటోమేట్‌
సులువైన ఇంటర్ఫేస్‌తో యాప్‌ పని చేస్తుంది. ప్రయాణాల్లో మీకో చక్కని ఫ్రెండ్‌గా సేవల్ని అందిస్తుంది. తెరని ముట్టకుండానే వాయిస్‌ కమాండ్స్‌తో ఫోన్‌లు చేయొచ్చు. మెసేజ్‌లు పంపొచ్చు. పాటల్ని ప్లే చేసుకోవచ్చు. జీపీఎస్‌ సేవల్ని కావాల్సినట్టుగా యాక్సెస్‌ చేసుకునే వీలూ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదో స్మార్ట్‌ డ్రైవింగ్‌ అసిస్టెంట్‌. మీ కాంటాక్ట్‌ లిస్ట్‌ని సింక్‌ చేసుకుని ఫోన్‌లో మాట్లాడొచ్చు. ఫోన్‌ని తాకకుండానే చేతితో సైగ చేస్తే చాలు. కమాండ్‌ రన్‌ అయ్యి కావాల్సింది వస్తుంది. ప్రీమియం వెర్షన్‌లోకి వెళ్తే ట్రాఫిక్‌ అలర్ట్‌లు, స్పీడ్‌ మానిటరింగ్‌, కస్టమైజ్‌ వాల్‌పేపర్లు.. ఇలాంటివి మరెన్నో యాక్సెస్‌ చేయొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/3doJuXO

డ్రైవర్లకో దోస్త్‌

Waze
పలు అవసరాలకు గూగుల్‌ మ్యాప్స్‌ని నెటిజన్లు ఎలా వాడతారో.. డ్రైవింగ్‌ చేసే వాళ్లందరూ ఈ యాప్‌ని కచ్చితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుంటారు. రియల్‌ టైమ్‌ అప్‌డేట్స్‌తో దారి పొడవునా సురక్షిత ప్రయాణానికి సాయం చేస్తుంది. స్పీడోమీటర్‌తో నిర్ణీత వేగాన్ని దాటకుండా జాగ్రత్త పడొచ్చు. మ్యూజిక్‌ యాప్‌లోని ట్రాక్స్‌ని దీంట్లోనే సింక్‌ చేసుకుని వినొచ్చు.

డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/3dpMrr8

ఫోన్‌లో ‘కారు లాంచర్‌’
ఆటోజెన్‌
ఫోన్‌ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా వాడేందుకు పలు లాంచర్‌లను ప్రయత్నించి ఉంటారు. అదే కారులో వెళ్తున్నప్పుడు మీ ఫోన్‌ని ప్రత్యేకంగా ఎందుకు వాడుకోకూడదు? అందుకే ఈ ఆటోజెన్‌ యాప్‌. డ్రైవింగ్‌లో ఫోన్‌ని వాడాల్సివస్తే సురక్షితంగా యాప్‌ సాయం తీసుకోవచ్చు. వెళ్లాల్సిన చోటుకి నేవిగేషన్‌ సెట్‌ చేసుకోవడంతో పాటు.. కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. స్పూటిఫై, ఇతర పాడ్‌కాస్ట్‌లలోని ట్రాక్స్‌ని వినొచ్చు. ఎక్కువగా ఫోన్‌ మాట్లాడాల్సిన కాంటాక్ట్‌లను ‘వన్‌ క్లిక్‌’తో అందుబాటులో ఉండేలా తెరపై పెట్టుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/3dnfqeW

బడ్జెట్‌ ఫోన్‌లు వాడితే..
గూగుల్‌ మ్యాప్స్‌ గో
తక్కువ ర్యామ్‌తో స్మార్ట్‌ ఫోన్‌ని వాడుతున్నట్లయితే జీపీఎస్‌ నేవిగేషన్‌ చేయడం కాస్త ఇబ్బందే. అలాంటి వారు కారులో ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలనుకున్నప్పుడు ఎలా? గూగుల్‌ మ్యాప్స్‌ గో యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. లైవ్‌ వాయిస్‌ కమాండ్స్‌తో ఎలాంటి సమస్య లేకుండా నేవిగేషన్‌ని పొందొచ్చు. నెట్‌వర్క్‌ సమస్యలు వస్తాయనుకుంటే ముందే మీరు వెళ్లాలనుకునే రూటుని స్టోర్‌ చేసుకునే వీలుంది. సుమారు 50 భాషల్లో నేవిగేషన్‌ని కమాండ్స్‌ని వినొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://bit.ly/3dnRXKB

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని