నొప్పిని తగ్గించే దిండ్లు

సంగీతం అంటే ఎవరికి ఇష్టముండదు. శ్రావ్యమైన సంగీతం చెవిన పడగానే మనసు ఆనందంతో పరవశిస్తుంది.

Updated : 30 Nov 2022 00:18 IST

సంగీతం అంటే ఎవరికి ఇష్టముండదు. శ్రావ్యమైన సంగీతం చెవిన పడగానే మనసు ఆనందంతో పరవశిస్తుంది. విచారం, బాధ తగ్గుతాయి. అందుకేనేమో కుంగుబాటు, ఆందోళన తగ్గటానికి సంగీతం చికిత్సగానూ పనిచేస్తుందని చెబుతుంటారు. ఈ విషయంలో డెన్మార్క్‌ పరిశోధకులు మరో ముందడుగేశారు. అత్యవసర శస్త్రచికిత్సల కోసం వేచి చూస్తున్నవారికి సంగీతం వినిపించే దిండ్లు ఎంతో మేలు చేస్తున్నాయని.. నొప్పి భావన, ఆందోళన తగ్గటానికి తోడ్పడు తున్నాయని గుర్తించారు. అత్యవసర చికిత్స గదిలోని మంచాల మీద దిండ్లకు ఎంపీ3 ప్లేయర్లను అమర్చి రోగులకు సంగీతాన్ని వినిపించి పరిశీలించారు. దీంతో హాయిగా ఉన్నామనే భావన పెరగటం గమనార్హం. శస్త్రచికిత్స కోసం వేచి చూస్తున్న సమయంలో ఆందోళన కూడా తగ్గుముఖం పట్టింది. అపెండిక్స్‌ వాపు, పేగుల్లో అడ్డంకి, పిత్తాశయంలో వాపు లేదా చీము వంటి సమస్యలతో తీవ్ర నొప్పికి గురవుతున్నా సంగీతం మంచి ప్రభావాన్ని చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని