విచారణలో జాప్యానికే పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ముందుకు సాగకుండా సమష్టి వ్యూహంలో భాగంగా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారంటూ సీబీఐ సోమవారం హైకోర్టుకు నివేదించింది. 10 ఏళ్లు అయినా డిశ్ఛార్జి పిటిషన్ల దశ దాటకుండా
హాజరు మినహాయించాలన్న జగన్ పిటిషన్‌పై సీబీఐ: తీర్పు వాయిదా
ఈనాడు, హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ముందుకు సాగకుండా సమష్టి వ్యూహంలో భాగంగా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారంటూ సీబీఐ సోమవారం హైకోర్టుకు నివేదించింది. 10 ఏళ్లు అయినా డిశ్ఛార్జి పిటిషన్ల దశ దాటకుండా వేస్తున్నారని పేర్కొంది. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సీబీఐ కోర్టు విచారణలో హాజరు మినహాయింపునివ్వాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపిస్తూ... ‘ఇలాంటి పిటిషన్లను గతంలో సీబీఐ కోర్టుతో పాటు ఇదే హైకోర్టు కొట్టివేసింది. అప్పట్లో సాక్షులను ప్రభావితం చేస్తారని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నిందితుడి హోదా పెరిగింది. ఓ రాష్ట్ర అధినేతగా మరిన్ని అవకాశాలున్నాయి. పిటిషనర్‌పై తీవ్రమైన కేసులున్నాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. ఒకరి తరువాత ఒకరు పిటిషన్లు దాఖలు చేస్తూ విచారణ జాప్యం చేస్తున్నారు. కేసును నీరుగారుస్తున్నారు. కేసు విచారణ దశలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. విచారణలో జాప్యంపై హాజరు మినహాయింపునివ్వాలంటూ ఎలాంటి చట్టం లేదు. 10 ఏళ్ల సుదీర్ఘ కాలం గడిచిపోయింది. గంటల కొద్దీ కోర్టు సమయం వృథా అయింది. కనీసం అభియోగాల నమోదు పూర్తయ్యాక విచారణ ప్రక్రియలో హాజరు మినహాయింపు కోరినా అభ్యంతరంలేదు. అభియోగాలు కూడా నమోదు కాకుండా మినహాయింపు కోరడానికి ఇది సరైన సమయం కాదు. గతంలో సీబీఐ, హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించడానికి వీల్లేదు. ఈ పిటిషన్ దాఖలు చేశాక 40 నుంచి 50 సార్లు విచారణ జరిగినా సీబీఐ కోర్టు హాజరు మినహాయింపునిచ్చింది...’ అని పేర్కొన్నారు. ఇంతకాలం లేని మినహాయింపు ఇప్పుడెందుకని, ఈ దశలో మినహాయింపునివ్వరాదని న్యాయవాది కె.సురేందర్ కోరారు. ఈ వాదనతో జగన్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి విభేదిస్తూ అప్పుడు వారానికి ఒక్కరోజు మాత్రమే విచారణ ఉండేదని, ప్రస్తుతం రోజువారీగా కొనసాగుతోందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్‌ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్‌కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ రాజేశ్వర్‌రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు అలియాస్ జె.శ్రీనివాస్‌రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్‌లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్‌గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్‌రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్