Telangana Budget 2022: రెండింటా అదుర్సే!

జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ), తలసరి ఆదాయాల్లో రంగారెడ్డి జిల్లా తొలి స్థానాల్లో నిలిచి అదరగొట్టింది. పారిశ్రామిక అభివృద్ధి, సేవలు, ఫార్మ తదితర రంగాల్లో ముందున్న జిల్లా రూ.1,93,507 కోట్ల జీడీడీపీని నమోదు చేసింది. అత్యధిక తలసరి ఆదాయం రూ.6,58,757గా

Updated : 08 Mar 2022 05:33 IST

జీడీడీపీ, తలసరి ఆదాయంలో ప్రథమస్థానంలో రంగారెడ్డి జిల్లా

జిల్లా స్థూల ఉత్పత్తిలో అట్టడుగున ములుగు జిల్లా

పెర్‌ క్యాపిటాలో వికారాబాద్‌ 

ఆర్థిక సర్వేలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ), తలసరి ఆదాయాల్లో రంగారెడ్డి జిల్లా తొలి స్థానాల్లో నిలిచి అదరగొట్టింది. పారిశ్రామిక అభివృద్ధి, సేవలు, ఫార్మ తదితర రంగాల్లో ముందున్న జిల్లా రూ.1,93,507 కోట్ల జీడీడీపీని నమోదు చేసింది. అత్యధిక తలసరి ఆదాయం రూ.6,58,757గా నమోదు అయింది. జీడీడీపీలో రంగారెడ్డి తరువాత హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ములుగు జిల్లా రూ.5,746 కోట్లతో అట్టడుగున ఉంది. మెరుగైన గణాంకాలతో నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాలు సత్తాచాటాయి. సోమవారం విడుదల చేసిన రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వేలో ఈ వివరాలను పొందుపర్చారు. ఒక జిల్లా పరిధిలోని వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, తదితర రంగాల్లోని ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకుని ఆ జిల్లా స్థూల ఉత్పత్తిని నిర్ధరిస్తారు.

తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిని దాటి.. 

పరిశ్రమలు, ఫార్మా, సాఫ్ట్‌వేర్‌, కుటీర పరిశ్రమలు తదితర ఉపాధి వనరులు అధికంగా ఉండటంతో తలసరి ఆదాయం/పెర్‌ క్యాపిటా(రూ.6,58,757)లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో, తరువాతి స్థానంలో హైదరాబాద్‌ నిలిచాయి. జాతీయ తలసరి ఆదాయం రూ.1,26,757తో పోల్చితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందున్నాయి. జిల్లాల్లోని తలసరి ఆదాయాన్ని పోల్చితే చివరి స్థానంలో వికారాబాద్‌ నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని