నేటి నుంచి వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆమె బయలుదేరి నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం

Published : 11 Mar 2022 05:36 IST

నల్గొండ జిల్లా కొండపాకగూడెం నుంచి ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శుక్రవారం నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆమె బయలుదేరి నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం కొండపాక గూడెం గ్రామానికి మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అక్కడి నుంచి పాదయాత్ర ద్వారా ఆమె పలు గ్రామాలను దాటి సాయంత్రం నార్కెట్‌పల్లికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి సమయానికి పాదయాత్ర పోతినేనిపల్లికి చేరుకుంటుంది.  

ఇప్పటికే 237.4 కిలోమీటర్ల యాత్ర పూర్తి

గతేడాది అక్టోబరు 20న షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఏడు నియోజకవర్గాలు, 15 మండలాలు, 5 పురపాలక సంఘాలు, 122 గ్రామాలను దాటి 237.4 కిలోమీటర్లు పూర్తి చేశారు. యాత్ర మధ్యలో ప్రజలతో మాటాముచ్చట, సభలు, మంగళవారాల్లో నిరుద్యోగ దీక్షలను నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళి అమల్లోకి రావడంతో నవంబరు 9న యాత్ర నిలిచిపోయింది. అనంతరం కరోనా కారణంగా వాయిదా పడింది. యాత్ర నిలిచిపోయిన గ్రామం నుంచే ఇప్పుడు తిరిగి ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని