శిక్షణలో ‘ఫలాలు’.. నగరపాలిక ‘గుడ్డు’ మార్కులు

బలవర్ధక ఆహారం తీసుకుంటేనే బాలలు ఆటపాటల్లో చురుగ్గా ఉంటారు.. ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు.. ఇది గమనించే కరీంనగర్‌ నగరపాలిక చక్కని ఆలోచన చేసింది.

Published : 22 May 2022 05:02 IST

ఈనాడు, కరీంనగర్‌: బలవర్ధక ఆహారం తీసుకుంటేనే బాలలు ఆటపాటల్లో చురుగ్గా ఉంటారు.. ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు.. ఇది గమనించే కరీంనగర్‌ నగరపాలిక చక్కని ఆలోచన చేసింది. అంబేడ్కర్‌ మైదానంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరానికి హాజరయ్యే వందలాది బాలబాలికల కోసం కార్పొరేషన్‌ అల్పాహారాన్ని సమకూరుస్తోంది. అందులో భాగంగా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు శిక్షణ అనంతరం కోడిగుడ్డు, పాలు, అరటిపండ్లను వారికి అందజేస్తున్నారు.. వాటికోసం బారులు తీరిన బాలలనే మీరు చిత్రంలో చూస్తోంది. సుమారు 25 క్రీడాంశాల్లో విద్యార్థులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సుమారు 2500 మంది వివిధ క్రీడాంశాల్లో మెలకువలు నేర్చుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని