తెలంగాణ వైతాళికుడు సురవరం

రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారుడిగా, బహుముఖ ప్రజ్జాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్లాఘించారు. ప్రతాపరెడ్డి జయంతి(మే 28) సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

Published : 28 May 2022 06:14 IST

సీఎం కేసీఆర్‌ నివాళులు

ఈనాడు, హైదరాబాద్‌: రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారుడిగా, బహుముఖ ప్రజ్జాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్లాఘించారు. ప్రతాపరెడ్డి జయంతి(మే 28) సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. తెలంగాణపై వివక్షను నాడే ఎదిరించి గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటారని తెలిపారు. ‘‘సురవరం, తెలంగాణ గడ్డ గర్వించదగ్గ బిడ్డ.. తెలంగాణ సాధన పోరాటంలో సురవరం స్ఫూర్తి ఇమిడి ఉంది. ఆయన జయంతి ఉత్సవాలను ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. సురవరం సేవలకు గుర్తుగా ఆయన పేరుతో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ పురస్కారాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నాం’’ అని సీఎం తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కమలాకర్‌, శ్రీనివాస్‌యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లు తెలంగాణకు సురవరం చేసిన సేవలను ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని