జోగినపల్లికి సాలుమారద తిమ్మక్క జాతీయ పురస్కారం

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ సాలుమారద తిమ్మక్క జాతీయ హరిత పురస్కారం పొందారు. వృక్ష మాత పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని

Published : 01 Jul 2022 06:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ సాలుమారద తిమ్మక్క జాతీయ హరిత పురస్కారం పొందారు. వృక్ష మాత పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని, వసంత్‌ నగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో తిమ్మక్క చేతుల మీదుగా గురువారం ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను దేశంలో అత్యుత్తమ సామాజిక సేవకులను ఈ పురస్కారానికి ఎంపిక చేసి బహూకరించారు. దేశంలో మొక్కలు నాటిన ప్రతీ ఒక్కరికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నట్లు సంతోష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని