‘ఆన్‌లైన్‌ టికెట్లకు’ ఏపీ హైకోర్టు బ్రేక్‌

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నానికి ఏపీ హైకోర్టు బ్రేక్‌ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్‌ (సవరణ) చట్టం,

Published : 02 Jul 2022 06:36 IST

ఈనాడు, అమరావతి: సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నానికి ఏపీ హైకోర్టు బ్రేక్‌ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్‌ (సవరణ) చట్టం, దాని ఆధారంగా జారీచేసిన జీవోల అమలును నిలిపివేసింది. ఈ నెల 2 నుంచి ప్రవేశపెట్టనున్న ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయ ప్రక్రియలో ముందుకెళ్లకుండా ప్రభుత్వాన్ని నిలువరించింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వకపోతే పిటిషనర్లకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని పేర్కొంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లను విక్రయిస్తున్న బుక్‌ మై షో తదితర సంస్థలు చేసుకున్న ఒప్పందాల్లో గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉందని అభిప్రాయపడింది. ఈ నెల 2లోగా ప్రభుత్వం తీసురాబోతున్న కొత్త విధానంలోకి మారకపోతే థియేటర్ల లైసెన్సులు రద్దయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. వ్యాజ్యాలపై తుది విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని