జాతి, సంస్కృతి పరిరక్షణకు ఐక్య ఉద్యమం

లంబాడీ జాతి మనుగడ, సంస్కృతి పరిరక్షణకు అందరూ ఏకమై ఉద్యమించాల్సిన అవసరముందని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎస్‌జే భక్తచరణ్‌దాస్‌ పిలుపునిచ్చారు. లంబాడీ హక్కుల పోరాట సమితి

Published : 02 Jul 2022 06:34 IST

లంబాడీలకు కేంద్ర మాజీ మంత్రి భక్తచరణ్‌దాస్‌ పిలుపు
ఘనంగా గ్వార్‌ బంజారా జాతీయ సమ్మేళనం

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: లంబాడీ జాతి మనుగడ, సంస్కృతి పరిరక్షణకు అందరూ ఏకమై ఉద్యమించాల్సిన అవసరముందని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎస్‌జే భక్తచరణ్‌దాస్‌ పిలుపునిచ్చారు. లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్‌) 25వ వార్షికోత్సవం సందర్భంగా మహబూబాబాద్‌లో శుక్రవారం గ్వార్‌ బంజారా జాతీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తచరణ్‌దాస్‌ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం అటవీ భూములకు ఇచ్చిన పట్టాలను కాపాడుకోవడంతో పాటు సాగులో ఉంటూ నేటికీ పట్టాలు రానివారు వాటిని సాధించేందుకు ఒక్కటి కావాలన్నారు. ఎల్‌హెచ్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌ మాట్లాడుతూ తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా సాధించుకున్నట్లు వివరించారు. సమ్మేళనంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌, కేంద్ర మాజీ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్‌, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జీసీసీ ఛైర్మన్‌ వాల్యానాయక్‌, ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఎస్‌.హనుమంతునాయక్‌, రాష్ట్ర అధ్యక్షుడు కోట్యానాయక్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కైలాస్‌నాయక్‌, తెలంగాణ మాలమహానాడు వ్యవస్థాపకులు అద్దంకి దయాకర్‌, నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని