లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్ల స్థానభ్రంశం?

వరద ఉద్ధృతికి గతనెల 14న కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్‌కు చెందిన 17 మోటార్లు మునిగిపోగా, భారీ పంపుల సాయంతో నీటిని తోడివేస్తున్నారు. ఈ క్రమంలో బాహుబలి మోటార్లు బయటపడగా.. వాటిలో ఆరు

Published : 07 Aug 2022 04:53 IST

కాళేశ్వరం, న్యూస్‌టుడే: వరద ఉద్ధృతికి గతనెల 14న కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్‌కు చెందిన 17 మోటార్లు మునిగిపోగా, భారీ పంపుల సాయంతో నీటిని తోడివేస్తున్నారు. ఈ క్రమంలో బాహుబలి మోటార్లు బయటపడగా.. వాటిలో ఆరు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నట్లు తెలిసింది. ఇంకొన్ని మోటార్ల పైభాగాలు వంగిపోయాయని, బిగించిన ప్రాంతం నుంచి పక్కకు కదిలినట్లు సమాచారం. 220 టన్నుల బరువున్న రెండు ఈవోటీ క్రేన్లు విరిగి మోటార్లపై పడడంతో వాటి ఫౌండేషన్‌ నిర్మాణాలు దెబ్బతిని, స్థానభ్రంశం చెందినట్లు తెలుస్తోంది. వాటిని కట్టర్‌లతో తెంపుతున్నారు. రెండు లిఫ్టులు పూర్తిగా ధ్వంసం కావటంతో తొలగింపు చర్యలు చేపట్టారు. మోటార్లను శుభ్రం చేయటం మొదలుపెట్టారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఈఈ తిరుపతిరావును వివరణ కోరగా, ఉన్న స్థానం నుంచి మోటార్లు కదల్లేదన్నారు. పైభాగంలో స్పల్పంగా దెబ్బతిన్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని