KCR: నిఖత్‌ జరీన్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. బాక్సింగ్‌లో ఆమె విజయం సాధించి, పతకం పొందగానే సీఎం ఆమెకు స్వయంగా ఫోన్‌ చేసి

Updated : 08 Aug 2022 06:20 IST

కామన్వెల్త్‌లో స్వర్ణం సాధించడంపై అభినందన
మంత్రులు, ప్రముఖుల హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. బాక్సింగ్‌లో ఆమె విజయం సాధించి, పతకం పొందగానే సీఎం ఆమెకు స్వయంగా ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. విజయ పరంపరను కొనసాగిస్తూ...స్వర్ణ పతకం సాధించి దేశగౌరవాన్ని ఇనుమడింపజేశారని, క్రీడారంగానికి, మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. జరీన్‌ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని తెలిపారు. క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సైతం ఆమెకు ఫోన్‌ చేసి తెలంగాణ బిడ్డగా చరిత్ర సృష్టించారంటూ అభినందించారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీ రామారావు, ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌, సబితారెడ్డి, తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు జరీన్‌కు అభినందనలు తెలిపారు. బర్మింగ్‌హామ్‌లో ఉన్న రాష్ట్రక్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు వేణుగోపాలచారిలు ఆమెను కలిసి ప్రశంసించారు. జరీన్‌ తెలంగాణకు గర్వకారణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని