విద్యుత్‌ చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా.. నేడు ఉద్యోగ సంఘాల మహాధర్నా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్‌ చట్టసవరణ బిల్లును నిరసిస్తూ సోమవారం మహాధర్నా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యుత్‌ ఇంజినీర్ల సంఘం, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) ప్రతినిధులు ఆదివారం తెలిపారు.

Published : 08 Aug 2022 04:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్‌ చట్టసవరణ బిల్లును నిరసిస్తూ సోమవారం మహాధర్నా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యుత్‌ ఇంజినీర్ల సంఘం, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) ప్రతినిధులు ఆదివారం తెలిపారు. మహాధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు విధులు బహిష్కరిస్తారని సంఘం నేత రత్నాకర్‌రావు తెలిపారు.

విద్యుత్‌ సరఫరా ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్నవారు, సబ్‌స్టేషన్లలో పనిచేసే ఉద్యోగులు కరెంటు సరఫరాకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహించాలని విద్యుత్‌ ఉద్యోగుల టీజాక్‌ ఛైర్మన్‌ కోడూరి ప్రకాష్‌, కన్వీనర్‌ ఎన్‌.శివాజీ సూచించారు. బిల్లుకు నిరసనగా సోమవారం ఉదయం అన్నికార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని