వీఆర్‌ఎస్‌ దరఖాస్తులను ఆమోదించండి

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌) కోసం వచ్చిన దరఖాస్తుల ఆమోద ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ఆర్టీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వీఆర్‌ఎస్‌

Published : 17 Aug 2022 05:59 IST

క్షేత్రస్థాయి అధికారులకు తెలంగాణ ఆర్టీసీ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌) కోసం వచ్చిన దరఖాస్తుల ఆమోద ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ఆర్టీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వీఆర్‌ఎస్‌ పథకాన్ని అమలు చేయాలని గడిచిన ఏడెనిమిది నెలలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యాజమాన్యం గడిచిన నెల 31ని తుది గడువుగా ప్రకటించింది. సుమారు 2,500 ఉద్యోగులు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. అందిన దరఖాస్తులను ఆమోదించాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులను ఆదేశిస్తూ ఆర్టీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని