జిల్లాలకు ఆసరా కార్డులు

రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 9.5 లక్షల ఆసరా పింఛన్ల తాలూకూ కార్డులు సిద్ధమయ్యాయి. జిల్లాలు, మండలాల వారీగా వాటిని బట్వాడా చేసే కసరత్తు ముమ్మరమైంది. పంపిణీలో లోటుపాట్లు లేకుండా చూసేలా, పింఛను మంజూరు

Published : 18 Aug 2022 04:56 IST

గ్రామాల వారీగా పంపిణీకి ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 9.5 లక్షల ఆసరా పింఛన్ల తాలూకూ కార్డులు సిద్ధమయ్యాయి. జిల్లాలు, మండలాల వారీగా వాటిని బట్వాడా చేసే కసరత్తు ముమ్మరమైంది. పంపిణీలో లోటుపాట్లు లేకుండా చూసేలా, పింఛను మంజూరు పత్రాలు ఆన్‌లైన్లో డౌన్‌లోడ్‌ చేసి లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు ఇతర అసహాయ వర్గాలకు పింఛన్లు మంజూరు చేసింది. ఈ నెలాఖరులోగా పంచాయతీలు, పట్టణాల పరిధిలో వార్డుల వారీగా పింఛను ధ్రువీకరణ పత్రాలు, కార్డులు అందజేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. స్థానిక ఎమ్మెల్యే లేదా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల వాటిని లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మేరకు గ్రామాల వారీగా పంపిణీ తేదీల రూపకల్పనపై ఎంపీడీవోలు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టులో కొత్త పింఛన్లు మంజూరు చేసినందున సెప్టెంబరులో వీరందరి ఖాతాల్లో నగదు జమకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని