CM KCR: ఐటీ, ఈడీ దాడులపై ఏం చేద్దాం?

సీఎం కేసీఆర్‌ మంగళవారం అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఆదాయపన్ను శాఖల వరుస దాడులపై చర్చించారు.

Updated : 23 Nov 2022 08:41 IST

మంత్రులు, నేతలతో సీఎం చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మంగళవారం అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఆదాయపన్ను శాఖల వరుస దాడులపై చర్చించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన విద్యాసంస్థల్లో సోదాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు. మంత్రి మల్లారెడ్డితో సీఎం ఫోన్‌లో మాట్లాడి, ధైర్యం చెప్పారని తెలిసింది. కేంద్రం వైఖరిపై సీఎం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థల దాడుల సమాచారాన్ని సేకరించి, వాటి పూర్వాపరాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మరో కొత్త మండలం: రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పోతంగల్‌ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. పోతంగల్‌తో పాటు మరో 13 గ్రామాలను దీని పరిధిలో చేర్చింది. దీనిపై శాసనభాపతి, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని