ఆలోచనే చిరుదివ్వె!

అవసరమే అన్నీ నేర్పిస్తుందంటారు. చిమ్మచీకట్లో జీవనం సాగించే వారిలో ఉదయించిన ఓ ఆలోచన చిరుదివ్వెలా మారి వెలుగులు నింపుతోంది.

Published : 01 Dec 2022 04:47 IST

అవసరమే అన్నీ నేర్పిస్తుందంటారు. చిమ్మచీకట్లో జీవనం సాగించే వారిలో ఉదయించిన ఓ ఆలోచన చిరుదివ్వెలా మారి వెలుగులు నింపుతోంది. నిర్మల్‌ జిల్లా మామడ మండలం రాంపూర్‌ శివారులోని నడుమ గూడెం అడవిలోని చేనులోనే మూడు కుటుంబాల వారు జీవనం సాగిస్తారు. గుడిసెలే వారి ఆవాసాలు. అక్కడ విద్యుత్తు వ్యవస్థ లేదు. రాత్రయిందంటే చిమ్మచీకట్లోనే కాలం గడపాలి. పురుగూపుట్ర భయం వెంటాడుతూనే ఉంటుంది. ఈ స్థితిలో ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. పంటకు పురుగుమందు పిచికారీ చేసే స్ప్రేయర్‌కు బ్యాటరీ ఉంటుంది. బల్బు వెలిగించుకోవడానికి దానిని ఉపయోగించుకోవచ్చన్న ఆలోచన వచ్చింది. వెంటనే అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పగటిపూట పక్క ఊరికి వెళ్లి తెలిసిన వారివద్ద ఛార్జింగ్‌ పెట్టుకుంటారు. రాత్రికి తెచ్చుకొని బల్బును వెలిగించుకుంటారు. ‘చేనుదగ్గరే ఉండాలని అడవిలో నివసిస్తున్నాం. ఏరిన పత్తి ఇంట్లోనే ఉంటుంది. పక్కనే దీపం, కొవ్వొత్తి వెలిగిస్తే ప్రమాదానికి ఆస్కారముంటుందన్న కారణంతో వాటికి దూరంగా ఉంటున్నాం’అని రాందాస్‌-భీంబాయి దంపతులు తెలిపారు.

-న్యూస్‌టుడే, మామడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని