4,235 కిలోమీటర్ల రహదారులు వర్షార్పణం!
వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు వేగంగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలకు రహదారులు భారీగా దెబ్బతిన్నాయి.
మరమ్మతులకు అంచనా వ్యయం రూ.1,878 కోట్లు
క్షేత్రస్థాయిలో అధ్యయనం పూర్తి.. పదో తేదీలోగా టెండర్ల ఖరారు
ఈనాడు, హైదరాబాద్: వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు వేగంగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలకు రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఏకంగా కొట్టుకుపోయాయి. కల్వర్టులు, చిన్నపాటి వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు రూ.50 కోట్లతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. తక్షణం పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో స్పష్టంచేశారు. దెబ్బతిన్న రహదారులను గుర్తించడం మొదలు టెండర్లు పిలవడం, పనుల ప్రారంభం వరకు సీఎం లక్ష్యాలను నిర్దేశించడంతో అధికారులు ఆగమేఘాల మీద కసరత్తు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేశారు. 4,235 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు.
రహదారుల మరమ్మతు కోసం రూ.1,878 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే పది జిల్లాల్లో టెండర్లు ఆహ్వానించారు. డిసెంబరు పదో తేదీలోగా అన్ని జిల్లాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో మొత్తం మరమ్మతులను పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
-
Latestnews News
IND vs AUS: అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ ‘డూప్లికేట్’ వ్యూహం!
-
India News
Mumbai: ముంబయిలో ఉగ్ర దాడులంటూ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..!