వచ్చే రెండేళ్లలో 39.31 కోట్ల మొక్కలు

రాష్ట్రంలో రానున్న రెండేళ్లకు తెలంగాణకు హరితహారం కింద మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 04 Dec 2022 04:55 IST

ప్రభుత్వం నిర్ణయించిన హరితహారం లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న రెండేళ్లకు తెలంగాణకు హరితహారం కింద మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2023 ఏడాదికి 19.29 కోట్లు, 2024 ఏడాదికి 20.02 కోట్ల చొప్పున మొత్తం 39.31 కోట్ల మొక్కలు నాటించనుంది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 12.84 కోట్ల మొక్కలు నాటాలని ఆదేశించింది. ఉపాధిహామీ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు వీలుగా జిల్లాస్థాయి లక్ష్యాలను పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించింది. సవరించిన లక్ష్యాల మేరకు పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఏర్పాట్లు చేయాలని కోరుతూ గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకుడు ఎం.హన్మంతరావు శనివారం జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని