తెలంగాణలో 91 మంది ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో భారీఎత్తున ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. సుదీర్ఘకాలం తర్వాత 91 మందికి స్థానచలనం కలిగిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 26 Jan 2023 05:31 IST

కమిషనర్లు, ఎస్పీలు, సీనియర్‌ అధికారులకు స్థానచలనం
ఎన్నికల నేపథ్యంలో కీలక నియామకాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో భారీఎత్తున ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. సుదీర్ఘకాలం తర్వాత 91 మందికి స్థానచలనం కలిగిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పలుమార్లు బదిలీలు జరిగినా పెద్దఎత్తున ఎస్పీలను మార్చడం ఇదే తొలిసారి. గత నెలాఖరున డీజీపీ పదవీవిరమణ నేపథ్యంలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి.  డీజీపీగా అంజనీకుమార్‌ను నియమించడంతో పాటు అయిదారేళ్ల వరకు ఒకే స్థానంలో పనిచేసిన ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగించారు. ఆ సమయంలో డీఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు గల ఉన్నతాధికారులను మార్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఎస్పీ, ఆ పై స్థాయి అధికారులపై దృష్టి సారించింది. ఎన్నికల సంవత్సరం కావడంతో తాజా బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌ బుధవారం సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో కసరత్తు చేసి అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధానంగా రాష్ట్రంలో మూడు కమిషనరేట్లకు కొత్త కమిషనర్లు నియమితులయ్యారు. కరీంనగర్‌, రామగుండం, ఖమ్మం కమిషనర్లుగా సుబ్బారాయుడు, రెమా రాజేశ్వరి, సురేశ్‌కుమార్‌లను నియమించారు. నల్గొండ, వనపర్తి, ములుగు, సిరిసిల్ల, గద్వాల, జగిత్యాల ఎస్పీలు కొత్తగా కొలువుదీరారు. 


అధికారుల పోస్టింగులు, బదిలీల  జాబితా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని