1న ‘మన ఊరు- మన బడి’ పాఠశాలలు ప్రారంభం

మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Published : 30 Jan 2023 04:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులన్నీ పూర్తయ్యాయని పేర్కొన్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్తు ఛైర్మన్లతో సమన్వయం చేసుకొని ఫిబ్రవరి 1న వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఆ రోజు గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించాలని సూచించారు. ఏదైనా నియోజకవర్గంలో ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఉంటే కొన్నిటిని తర్వాత రోజుల్లో ప్రారంభించుకోవచ్చని తెలిపారు. మొదటి విడతలో 9,123 బడులను రూ.3,497.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 1న మొత్తం 684 పాఠశాలలనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ జాబితాలను  జిల్లాలకు పంపారు. ఇందులో హైదరాబాద్‌ జిల్లాలో ఆరు, వరంగల్‌ జిల్లాలో ఎనిమిది పాఠశాలలే ఉన్నాయి. ఈ 684లో ఉన్నత పాఠశాలలు 40లోపే ఉండగా.. ప్రాథమిక పాఠశాలలు 90 శాతం ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని