సామాజిక సేవలో పూర్వ విద్యార్థులు

సరస్వతీ శిశు మందిరాల పూర్వ విద్యార్థులు సామాజిక సేవలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Updated : 30 Jan 2023 05:41 IST

సరస్వతీ విద్యాపీఠం స్వర్ణజయంతి ఉత్సవాల్లో విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షుడు చామర్తి

బండ్లగూడజాగీర్‌, న్యూస్‌టుడే: సరస్వతీ శిశు మందిరాల పూర్వ విద్యార్థులు సామాజిక సేవలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సరస్వతీ విద్యాపీఠం స్వర్ణజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌ బండ్లగూడజాగీర్‌లోని శారదాధామంలో పూర్వ విద్యార్థి పరిషత్‌ రాష్ట్రస్థాయి మహాసమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరస్వతీ శిశు మందిరాల్లో రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకున్నారని, ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదన్న ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. శిశుమందిరాల్లో సంస్కారంతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు.మణిపుర్‌ వర్సిటీ ఛాన్సలర్‌, శ్రీసరస్వతీ విద్యాపీఠం అధ్యక్షుడు ప్రొ.తిరుపతిరావు ప్రత్యేక అతిథిగా హాజరైన ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులైన రావుల గిరిధర్‌(ఐపీఎస్‌), కో-ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ సభ్యురాలు కిరణ్మయి తదితరులను సన్మానించారు. శిశు మందిరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం(తెలంగాణ) అధ్యక్షుడు హరిస్మరణ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు శ్రీ(్షనివాస్‌, సంఘటనా కార్యదర్శి పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని