ఆహ్లాదం ఆదర్శం ఈ ఠాణా

గోడలపై రంగురంగుల బొమ్మలు, గదిలో పిల్లలను ఆనందంగా ఆడించే ఆట పరికరాలను చూస్తుంటే.. ప్లేస్కూల్‌ గానీ, అంగన్‌వాడీ కేంద్రం గానీ అయిఉండొచ్చు అనుకుంటున్నారు కదూ..!

Published : 06 Feb 2023 04:09 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: గోడలపై రంగురంగుల బొమ్మలు, గదిలో పిల్లలను ఆనందంగా ఆడించే ఆట పరికరాలను చూస్తుంటే.. ప్లేస్కూల్‌ గానీ, అంగన్‌వాడీ కేంద్రం గానీ అయిఉండొచ్చు అనుకుంటున్నారు కదూ..! అలా భావిస్తే పొరపాటే!! ఇది మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషనులోని మహిళా సహాయ కేంద్రం. ఆశ్చర్యమనిపిస్తున్నా.. ఇది నిజం. కుటుంబ తగాదాలతో స్టేషనుకు వచ్చే దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తుంటారు. కౌన్సెలింగుకు అంతరాయం కలగకుండా వారి పిల్లలను ఆహ్లాదంగా ఆడించడానికి అక్కడి సీఐ సతీష్‌ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఈ ఏర్పాటు. మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ సూచనలకు అనుగుణంగా మహిళా సహాయ కేంద్రంలోని ఓ గదిని రూ.40 వేలతో ఇలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని