ఏజెన్సీలో గిరిజన టీచర్లకే పదోన్నతులు ఇవ్వండి
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఉపాధ్యాయులకు మాత్రం పదోన్నతులు ఇవ్వాలని, నియామకాలు జరపాలని గిరిజన ఉపాధ్యాయ సంఘాల ఐకాస (టీటీయూ ఐకాస) రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరింది.
మంత్రి కేటీఆర్‌కు టీటీయూ ఐకాస వినతి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఉపాధ్యాయులకు మాత్రం పదోన్నతులు ఇవ్వాలని, నియామకాలు జరపాలని గిరిజన ఉపాధ్యాయ సంఘాల ఐకాస (టీటీయూ ఐకాస) రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరింది. ఈ మేరకు ఐకాస తరఫున పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు, ఐకాస నేత లక్ష్మణ్‌నాయక్ తదితరులు సోమవారం అసెంబ్లీలో కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ, మైదాన ప్రాంతాలకు వేర్వేరుగా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని విన్నవించారు. స్పందించిన కేటీఆర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ వేశామని, దానికి లోబడి ఏజెన్సీలో ఉన్న పదోన్నతులను స్థానిక గిరిజన టీచర్లకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఐకాస కన్వీనర్లు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయర్, కల్లూరి జయబాబు, ఎం.శ్రీనివాస్‌రావు, రామారావు తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి