పది మంది రాష్ట్ర అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతులు

పది మంది రాష్ట్ర ఉన్నతాధికారులకు ఐఏఎస్‌లుగా పదోన్నతులు లభించాయి. రెవెన్యూ విభాగంలో అయిదుగురు, రెవెన్యూయేతర విభాగంలో అయిదుగురు వీటిని పొందారు.

Published : 08 Feb 2023 03:43 IST

కేంద్రం నుంచి సమాచారం
ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: పది మంది రాష్ట్ర ఉన్నతాధికారులకు ఐఏఎస్‌లుగా పదోన్నతులు లభించాయి. రెవెన్యూ విభాగంలో అయిదుగురు, రెవెన్యూయేతర విభాగంలో అయిదుగురు వీటిని పొందారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అధికారిక సమాచారం అందింది. ఆయా అధికారులకు ఐఏఎస్‌ బ్యాచ్‌ కేటాయింపు తదితర అంశాలతో కేంద్రం నుంచి నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది.

రెవెన్యూ విభాగంలో...

రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ ఎండీ ఎ.హెచ్‌.నిర్మలకాంతివెస్లీ, కరీంనగర్‌ జడ్పీ సీఈవో చెక్కా ప్రియాంక, వరంగల్‌ అదనపు కలెక్టర్‌ కోటా శ్రీవత్స, నిజామాబాద్‌ అదనపు కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌, జగిత్యాల అదనపు కలెక్టర్‌ పోస్టు నుంచి ఇటీవల బదిలీ అయిన జల్డ అరుణశ్రీలు రెవెన్యూ విభాగం నుంచి ఐఏఎస్‌లుగా పదోన్నతులు పొందారు.

రెవెన్యూయేతర విభాగంలో..

రెవెన్యూయేతర విభాగంలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఎండీ ఇ.వెంకటనరసింహారెడ్డి (సహకారశాఖ), పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ కార్యాలయంలో అదనపు కార్యదర్శి కాత్యాయనిదేవి (పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ), ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు కార్యాలయ ప్రత్యేకాధికారి కోరెం అశోక్‌రెడ్డి (సహకార శాఖ), వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్‌ కల్లెపు హరిత, డిప్యుటేషన్‌లో కేంద్ర విద్యాశాఖలో సంచాలకునిగా ఉన్న నవీన్‌ నికోలస్‌ (గిరిజన సంక్షేమశాఖ)లు పదోన్నతులు పొందారు.

రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి సమర్థులైన అధికారులతో జాబితా రూపొందించి, కేంద్రానికి పంపగా.. అందులో 25 మందికి యూపీఎస్సీలో మౌఖిక పరీక్షల అనంతరం వీరిని ఎంపిక చేశారు. వీరు అంతర్గత శిక్షణతో ఐఏఎస్‌ హోదాలో కొనసాగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు