వణికిన ఉత్తర తెలంగాణ

పిడుగులు.. ఉరుములు.. మెరుపులతో ఉత్తర తెలంగాణ వణికిపోయింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది.

Updated : 20 Mar 2023 05:47 IST

ములుగు జిల్లాలో 13.6 సెంటీమీటర్ల వాన
నేడూ.. రేపూ కురిసే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: పిడుగులు.. ఉరుములు.. మెరుపులతో ఉత్తర తెలంగాణ వణికిపోయింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. రాష్ట్రంలోనే గరిష్ఠంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో  13.6 సెంటీమీటర్ల వాన కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భద్రాద్రి, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజధానిలోని కాప్రా సర్కిల్లో గరిష్ఠంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. నల్గొండ జిల్లాలో సాధారణం కన్నా 8.4 డిగ్రీలు తగ్గి 29 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా 5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈదురు గాలులతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో వాన కురుస్తుందని పేర్కొంది. మంగళవారం కూడా కొన్నిచోట్ల వానలు పడే అవకాశాలు ఉన్నాయంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని