తరగతి గదుల్లో మిర్చి ఆరబోత

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన గ్రామంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్‌ మోతే కిష్టయ్య తన పొలంలో పండిన మిర్చిని ఆదివారం రాత్రి పాఠశాలకు తరలించి రెండు తరగతి గదుల్లో ఆరబోశారు.

Published : 21 Mar 2023 04:52 IST

న్యూస్‌టుడే, పలిమెల: యశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన గ్రామంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్‌ మోతే కిష్టయ్య తన పొలంలో పండిన మిర్చిని ఆదివారం రాత్రి పాఠశాలకు తరలించి రెండు తరగతి గదుల్లో ఆరబోశారు. ఈ పాఠశాలలో 1 నుంచి 8 తరగతుల్లో 132 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. ఆ రెండు గదుల్లోని 3, 4 తరగతుల విద్యార్థులను.. ఉపాధ్యాయులు  1, 2 తరగతుల విద్యార్థులతో కలిపి కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు. వర్షం నేపథ్యంలో వేరే దారిలేక మిర్చిని తరగతి గదిలో పోసినట్లు కిష్టయ్య తెలిపారు. తాను సెలవులో ఉన్నానని, వెంటనే మిర్చిని ఖాళీ చేయిస్తానని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని