దేశమంతా ఒకే కమీషన్‌ విధానాన్ని అమలు చేయాలి

దేశవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల డీలర్లకు ఒకే రకమైన కమీషన్‌ లేదా గౌరవ వేతనం ఇవ్వాలని అఖిల భారత రేషన్‌ డీలర్ల సమాఖ్య నాయకులు డిమాండ్‌చేశారు.

Published : 23 Mar 2023 04:07 IST

అఖిల భారత రేషన్‌ డీలర్ల సమాఖ్య డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల డీలర్లకు ఒకే రకమైన కమీషన్‌ లేదా గౌరవ వేతనం ఇవ్వాలని అఖిల భారత రేషన్‌ డీలర్ల సమాఖ్య నాయకులు డిమాండ్‌చేశారు. డీలర్ల సమస్యల పరిష్కారం కోరుతూ దిల్లీ జంతర్‌మంతర్‌ రోడ్డులో బుధవారం ధర్నా చేశారు. కార్యక్రమంలో రేషన్‌ డీలర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు మాట్లాడుతూ చాలీచాలని కమీషన్‌తో తాము నానా అవస్థలు పడుతున్నందున ‘ఒకే దేశం-ఒకే రేషన్‌ కమీషన్‌’ విధానాన్ని అమలు చేయాలన్నారు. దుకాణాల వద్ద బియ్యం, గోధుమల దిగుమతికి అయ్యే హమాలీల వ్యయాన్ని ప్రభుత్వాలు భరించాలన్నారు. డీలర్లకు ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సమాఖ్య జాతీయ అధ్యక్షుడు విశ్వంభర బసు, కోశాధికారి కాచం కృష్ణమూర్తి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజంగి నందయ్య, రాష్ట్ర నాయకులు వంగరి నాగరాజు, రాజలింగం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని