ఉత్తమ యాజమాన్యాలకు అవార్డులు

కార్మిక దినోత్సవం సందర్భంగా ఉత్తమ యాజమాన్యాలకు అవార్డులు, కార్మిక సంఘాలు, వర్క్‌మెన్లకు శ్రమశక్తి పురస్కారాలు ఇవ్వనున్నట్లు కార్మికశాఖ కమిషనర్‌ అహ్మద్‌ నదీం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 28 Mar 2023 04:24 IST

కార్మికశాఖ కమిషనర్‌ అహ్మద్‌ నదీం

ఈనాడు, హైదరాబాద్‌: కార్మిక దినోత్సవం సందర్భంగా ఉత్తమ యాజమాన్యాలకు అవార్డులు, కార్మిక సంఘాలు, వర్క్‌మెన్లకు శ్రమశక్తి పురస్కారాలు ఇవ్వనున్నట్లు కార్మికశాఖ కమిషనర్‌ అహ్మద్‌ నదీం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, కార్మికులు ఏప్రిల్‌ 15 సాయంత్రం 5 గంటల్లోగా సంబంధిత కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్మికశాఖ వెబ్‌సైట్లో, డిప్యూటీ కమిషనర్ల వద్ద, కార్మికశాఖ కమిషనర్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. అవార్డులను మే 1న రవీంద్రభారతిలో జరిగే కార్మిక దినోత్సవ కార్యక్రమంలో అందజేస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని