నిర్లక్ష్యపు ఇంజినీర్లపై కఠిన చర్యలు

తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న ఇంజినీర్లపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

Published : 29 Mar 2023 05:15 IST

పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌  బోర్డు సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న ఇంజినీర్లపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పనుల్ని వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైతే విశ్రాంత ఇంజినీర్ల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. డీజీపీ కార్యాలయంలో కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ అధ్యక్షతన మంగళవారం బోర్డు సమావేశం జరిగింది. డీజీపీ అంజనీకుమార్‌, హోంశాఖ కార్యదర్శి జితేందర్‌, కార్పొరేషన్‌ ఎండీ రాజీవ్‌రతన్‌, అదనపు డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, డీఐజీ రమేశ్‌రెడ్డి, కార్పొరేషన్‌ సీఈ విజయ్‌కుమార్‌, ఎస్పీ రక్షితామూర్తి హాజరయ్యారు. కార్పొరేషన్‌లో నాణ్యత నియంత్రణ, ఫైనాన్స్‌, అకౌంట్స్‌ విభాగాలను బలోపేతంచేసేందుకు సీనియర్‌ అధికారుల్ని నియమించాలని, నిర్మాణంలో ఉన్న పోలీస్‌ కార్యాలయ భవనాలను త్వరగా పూర్తిచేసేందుకు నిధుల్ని మంజూరు చేసేలా ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయించారు. కార్పొరేషన్‌ విశ్రాంత అధికారులు, ఉద్యోగులకు పింఛను విషయమై ప్రత్యేక కమిటీ వేయనున్నారు.

*  తెలంగాణకు కేటాయించిన 74వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు అంకిత్‌కుమార్‌ సంక్వార్‌, అవినాశ్‌ కుమార్‌, గీతే మహేశ్‌ బాబాసాహెబ్‌, శివం ఉపాధ్యాయ్‌, శేషాద్రినీరెడ్డి మంగళవారం డీజీపీ అంజనీకుమార్‌తో భేటీ అయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు