మే 8, 9, 21 తేదీల్లో ఏఈఈ పరీక్ష

రాష్ట్రంలో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షల షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను మే 8, 9, 21 తేదీల్లో నిర్వహించనుంది.

Published : 30 Mar 2023 05:56 IST

ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, అగ్రికల్చరల్‌, మెకానికల్‌ పోస్టులకు సీబీఆర్‌టీ
సివిల్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షల షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను మే 8, 9, 21 తేదీల్లో నిర్వహించనుంది. ఏఈఈ పోస్టులకు ఈ ఏడాది జనవరి 22న ఓఎంఆర్‌ పద్ధతిలో రాతపరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 81,548 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 61 వేల మంది పరీక్ష రాశారు. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షను కమిషన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించే తేదీలను తాజాగా ప్రకటించింది. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత(సీబీఆర్‌టీ) విధానంలో, సివిల్‌ ఇంజినీరింగ్‌ పరీక్షను ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్లో ప్రవేశపత్రాలను పొందుపర్చనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో), వాయిదా పడిన వెటర్నరీ అసిస్టెంట్‌, టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో) పరీక్షల తేదీలను కమిషన్‌ త్వరలో ప్రకటించనుంది.

ఏఈఈ పరీక్షల షెడ్యూలు ఇలా..

మే 8న ఉదయం, మధ్యాహ్నం: ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌
మే 9న ఉదయం, మధ్యాహ్నం: అగ్రికల్చరల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌
మే 21న ఉదయం, మధ్యాహ్నం: సివిల్‌ ఇంజినీరింగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని