చేనేత బిడ్డకు అమెరికాలో అరుదైన గౌరవం

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు వాసికి అగ్రదేశంలో అరుదైన గౌరవం దక్కింది.

Updated : 02 Apr 2023 04:29 IST

‘మేనకూరు డాక్టర్‌’ పేరుతో ఒకరోజు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు వాసికి అగ్రదేశంలో అరుదైన గౌరవం దక్కింది. ‘మార్చి 28’కి ఆయన గౌరవార్థం ప్రత్యేక గుర్తింపునిచ్చింది. మేనకూరుకు చెందిన డా.రమేష్‌ పేరంశెట్టి అమెరికాలోని అలబామా రాష్ట్రం టస్కలూసా నగరంలో స్థిరపడ్డారు. 25 ఏళ్లుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు. కొవిడ్‌-19 సమయంలో విశేష కృషి చేశారు. ఈ నేపథ్యంలో ‘మార్చి 28’కి ఆయన పేరిట గుర్తింపునిస్తున్నట్లు నగర మేయర్‌ వాల్ట్‌ మడాక్స్‌ ప్రకటించారు. ఇక నుంచి ఆ రోజున ఆయన గౌరవార్థం మున్సిపాలిటీ తరఫున ఉచితంగా వైద్యసేవలు అందించనున్నట్లు వెల్లడించారు. మేనకూరుకు చెందిన పేరంశెట్టి చిన్నగురునాథం, రాజేశ్వరమ్మ దంపతుల సంతానం రమేష్‌. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా.. పట్టుదలతో చదివి తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాల నుంచి పట్టా అందుకున్నారు. వృత్తిలో రాణించేందుకు అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా రమేష్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ‘మార్చి 28తో వైద్య రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నా. సహకరించిన వైద్య బృందం, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని