బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్సీబీసీ) ఛైర్మన్‌ హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.

Published : 30 May 2023 05:06 IST

ఎన్సీబీసీ ఛైర్మన్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతల వినతి 

ఈనాడు, దిల్లీ: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్సీబీసీ) ఛైర్మన్‌ హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు నేతృత్వంలోని బృందం సోమవారం దిల్లీలో ఎన్సీబీసీ ఛైర్మన్‌ను  కలిసింది. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడంతో నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత చదువులు చదివే బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని, క్రిమీలేయర్‌ ఎత్తివేయాలని, కులవృత్తులు కోల్పోయిన బీసీ కులాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రాయితీపై రుణాలు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు బీసీలకు అందించే వివిధ పథకాలకు 60 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్సీబీసీ ఛైర్మన్‌ను కలిసిన వారిలో సంఘం నాయకులు కర్రి వేణుమాధవ్‌, డాక్టర్‌ పద్మలత, పరశురాం తదితరులున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు