ఆర్టీసీలో ఈడీల బదిలీలు

ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)ల బదిలీలు జరిగాయి. ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఈడీగా ఉన్న సి.వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ జోన్‌కి బదిలీ అయ్యారు.

Published : 01 Jun 2023 03:38 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌కు వెంకటేశ్వర్లు..
సీపీఎం కృష్ణకాంత్‌కు పదోన్నతి

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)ల బదిలీలు జరిగాయి. ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఈడీగా ఉన్న సి.వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ జోన్‌కి బదిలీ అయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ యాదగిరి బుధవారం పదవీ విరమణ పొందగా.. ఈ స్థానంలో కరీంనగర్‌ జోన్‌ ఈడీ వి.వెంకటేశ్వర్లును సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ నియమించారు. బస్‌భవన్‌లో చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ (సీపీఎం)గా పనిచేస్తున్న కృష్ణకాంత్‌కు ఈడీగా పదోన్నతి కల్పించారు. ఆయనకు అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్‌, కమర్షియల్‌, ఎస్టేట్స్‌, ప్రాజెక్టుల బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీలో ఎండీ తర్వాత హోదా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లదే. అయితే కొద్దికాలం క్రితం ఈడీల పైన మరో పోస్టును ఏర్పాటు చేశారు. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా రిటైర్డ్‌ పోలీసు అధికారి రవీందర్‌ను నియమించారు. వినోద్‌కుమార్‌ కొద్ది వారాల క్రితం వరకు బస్‌భవన్‌లో ఈడీగా కీలకమైన ఇంజినీరింగ్‌ బాధ్యతలు చూశారు. తర్వాత ఆయన్నుంచి ఇంజినీరింగ్‌ బాధ్యతల్ని తప్పించారు. కాగా హైదరాబాద్‌ జోన్‌ ఈడీగా పురుషోత్తం, బస్‌భవన్‌లో కీలకమైన ఈడీ (ఆపరేషన్స్‌, కార్పొరేషన్‌ సెక్రటరీ)గా పీవీ మునిశేఖర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు