ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ని కన్వీనర్‌ ఆచార్య పి.వరలక్ష్మి సోమవారం విడుదల చేశారు.

Published : 06 Jun 2023 03:16 IST

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ని కన్వీనర్‌ ఆచార్య పి.వరలక్ష్మి సోమవారం విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను ఈ నెల 8వ తేదీ 5 గంటలలోగా ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తామని తెలిపారు. వెబ్‌సైట్‌   www.icet.tsche.ac.in లో ‘కీ’ ని ఉంచినట్లు వివరించారు. ఈ నెల 20న తుది ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని