Sangareddy: పొర్లు దండాలతో శశికళ 200 కి.మీ. యాత్ర

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామానికి చెందిన శశికళ లోక కల్యాణార్థం 200 కి.మీ.దూరంలోని కర్ణాటక ఘత్తుర్గి భాగమ్మ దేవి ఆలయానికి ‘పొర్లు దండాల’తో యాత్రకు శుక్రవారం శ్రీకారం చుట్టారు.

Published : 12 Nov 2022 07:54 IST

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామానికి చెందిన శశికళ లోక కల్యాణార్థం 200 కి.మీ.దూరంలోని కర్ణాటక ఘత్తుర్గి భాగమ్మ దేవి ఆలయానికి ‘పొర్లు దండాల’తో యాత్రకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. సుమారు 30 రోజుల్లో గమ్యస్థానం చేరుకునేలా ప్రణాళిక వేసుకున్నారు. ఇప్పటికే ఆమె మూడు సార్లు 190 కి.మీ దూరంలోని తుల్జా భవానీమాత ఆలయానికి పొర్లు దండాలతో చేరుకున్నారు. హైదరాబాద్‌- ముంబయి 65వ నంబరు జాతీయ రహదారిలో సాగనున్న యాత్రలో భక్తబృందం ఆమె వెంట నడుస్తూ సపర్యలు చేస్తోంది. యాత్ర ప్రారంభం సందర్భంగా జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు.. శశికళను సత్కరించి యాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు.

-న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని